The Impossible way in the World

ప్రపంచంలోని అసాధ్యమైన మార్గం | The Impossible way in the World
కొలంబియా మరియు పనామా సరిహద్దుల మధ్య ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం జార్జియన్ గ్యాప్. ఈ 100 మైళ్ళ ప్రాంతాన్ని దాటడం అంటే మృత్యువు యొక్క లోయ గుండా వెళ్ళడం. ఈ ప్రాంతం కారణంగా నేటికి ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని ఏ రోడ్డు లేదా రైల్ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడలేదు. మొత్తం మానవ చరిత్రలో ఇప్పటివరకు ఈ మొత్తం ప్రాంతాన్ని ఏదైనా కారు లేదా జీపు ద్వారా దాటడం కేవలం ఏడు సార్లు మాత్రమే ప్రయత్నం జరిగింది. ఇంత ప్రమాదకరమైనప్పటికీ కొంతమందికి ఈ ప్రాంతాన్ని దాటడం చాలా ముఖ్యం.
ప్రతి సంవత్సరం వేలాది మంది, లక్షలాది మంది దక్షిణ అమెరికా దేశాల నుంచి ముఖ్యంగా కొలంబియా, ఈక్వేడార్ మరియు వెనిజులా నుంచి ఈ ప్రాంతాన్ని దాటి, మధ్య మరియు ఉత్తర అమెరికాకు మంచి జీవితం కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. 2022 లో ఈ డార్లియన్ గ్యాప్ ద్వారా రెండున్నర లక్షల మంది మెక్సికో వెళ్లి ఆ తర్వాత అమెరికా వెళ్ళాలని ప్రయత్నించగా, ఈ రెండున్నర లక్షల మందిలో 100 మంది ఈ గ్యాప్ ను దాటుకుంటూ చనిపోయారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇంత డబ్బు మరియు సాంకేతికత ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో రహదారి లేదా రైలు నెట్వర్క్ ను నిర్మించడానికి ఇప్పటివరకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
21వ శతాబ్దంలో కాలిపోతున్న ఎడారిలో కూడా అత్యాధునిక నగరాలు నిర్మించబడ్డాయి. ఈ చిన్న ప్రాంతంలో రహదారి లేదా రైలు నిర్మాణం కష్టంగా మారడానికి నాలుగు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ప్రమాదకరమైన వాతావరణం. డారియన్ గ్యాప్ ఈక్వేటర్ కి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని కారణంగా ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఉత్తర మరియు దక్షిణాన అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలు ఉన్నాయి. దీని కారణంగా తేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతంలో చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. ఏడాది పొడవున ఇక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అంటే 365 రోజుల్లో 330 రోజుల పాటు కురుస్తూ ఉంటాయి. దీని కారణంగానే ఇక్కడ అకస్మాత్తుగా వరదలు మాత్రమే కాకుండా పర్వతాలపై కూడా ల్యాండ్ స్లైడింగ్ జరుగుతూ ఉంటుంది. వర్షం మరియు వరదల కారణంగా ఇక్కడ నిర్మాణం చాలా కష్టం ఎందుకంటే కాంక్రీట్, సిమెంట్ లేదా తారు ఇవన్నీ పొడిగా ఉండడానికి పొడి మరియు వేడి వాతావరణం అవసరం.
ఇక్కడ రెండవ అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రమాదకరమైన జంతువులు మరియు కీటకాలు. ఈ డారియన్ గ్యాప్ లో కనిపించినంత విషపూరితమైన పాములు, సాలిపురుగులు మరియు దోమలు మన భూమి మీద మరెక్కడ కనపడవు. ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఆసుపత్రి లేదా సమీపంలో ఇల్లు కూడా ఎక్కడా లేవు. కాబట్టి వీటిలో ఏదైనా మిమ్మల్ని కరిస్తే మీరు బ్రతకడం దాదాపుగా అసాధ్యం. అందుకే ఇటు పక్క నుంచి వెళ్లే చాలా మంది ప్రజలు మలేరియా, డెంగ్యూ, పాము విషం ద్వారానో లేదా నదిలో మునిగో చనిపోతున్నారు. కానీ ఇప్పుడు అమెరికా అలాగే ఇతర దేశాలకు ఇక్కడ రోడ్డు నిర్మించడం పూర్తిగా అసాధ్యమైన విషయం. అంతేకాకుండా ఖరీదుతో కూడుకుంది. కష్టంతో కూడుకున్నది. కానీ అది అసాధ్యం అయితే కాదు.
మరి అలాంటప్పుడు ఇక్కడ రోడ్డు లేదా రైలు మార్గాలు నిర్మించే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు. దానికి కారణం ఏంటి ? వాస్తవానికి కొన్ని దేశాలు ఇక్కడ ఎలాంటి రోడ్డు లేదా రైలు నెట్వర్క్ ను నిర్మించాలని అనుకోవడం లేదు ముఖ్యంగా అమెరికా మరియు పనామా.
నిజానికి 19వ శతాబ్దంలో పనామా కొలంబియా ప్రావిన్స్ గా ఉండేది. అయితే ఈ డారియన్ గ్యాప్ కారణంగా పనామాను నియంత్రించడం కొలంబియాకు చాలా కష్టమైంది. కొలంబియా ప్రభుత్వానికి పనామాతో అనుసంధానం కావడానికి కేవలం ఒకే ఒక మార్గం సముద్రం. ఈ డిస్కనెక్ట్ ను సద్వినియోగం చేసుకొని పనామా కొలంబియా నుంచి స్వాతంత్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది.
20, 30 వ శతాబ్దంలో పెరుగుతున్న సూపర్ పవర్ ఈ ఉద్యమం పై చాలా ఆసక్తి కనపరచడం ప్రారంభించింది. దీని పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాస్తవానికి పనామా కెనాల్ పై అమెరికా చాలా ఆసక్తిని చూపించింది. పనామా కెనాల్ నిర్మాణానికి ముందు తూర్పు మరియు పశ్చిమ అమెరికా మధ్య వాణిజ్యం చాలా కష్టంగా ఉన్నందున ఈ కాలువ పై తన నియంత్రణను కలిగి ఉండాలని కోరుకుంది అమెరికా.
పశ్చిమ లేదా తూర్పు తీరానికి చేరుకోవడానికి ఓడలన్నీ దక్షిణ అమెరికా మొత్తాన్ని దాటాలి కాబట్టి అమెరికా తూర్పు మరియు పశ్చిమ తీర రేఖలు దాటుకొని డిస్కనెక్ట్ చేయబడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ కృత్రిమ కాలువను నిర్మించారు. దీని తర్వాత అమెరికా యొక్క వాణిజ్య నౌకలు మాత్రమే కాకుండా నావికా దళం కూడా ఇప్పుడు సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లొచ్చు. కొన్ని రోజుల్లో పనామా కాలువను ఎవరు నియంత్రిస్తారో వాళ్ళు అమెరికా యొక్క పెద్ద బలహీనతను నియంత్రించగలుగుతారు. కొలంబియా ఈ కాలువ నియంత్రణను ఆ సమయంలో అమెరికాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే పనామా స్వాతంత్ర ఉద్యమంలో అమెరికా పూర్తిగా మద్దతు ఇచ్చింది.
ఫలితంగా 1903 లో పనామా స్వతంత్ర దేశంగా మారింది. అమెరికా గుర్తించిన మొదటి దేశం పనామా, ప్రతిఫలంగా పనామా ప్రభుత్వం ఈ కాలువ చుట్టూ ఉన్న మొత్తం భూమిని శాశ్వత లీజుకు అమెరికాకి ఇచ్చింది. 1999 వరకు ఈ ప్రాంతమంతా అమెరికా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఆ తర్వాత 1999 లో ఈ కాలువ నియంత్రణ పనామాకు తిరిగి వచ్చింది. కానీ నేటికి ఈ చౌక్ పాయింట్ అమెరికా మరియు ఇతర దేశాలకు చాలా ముఖ్యమైంది. నేడు ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో దాదాపుగా 6% దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా మధ్య ఉన్న ఈ చౌక్ పాయింట్ గుండా వెళుతుంది. ఈ కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 13 నుంచి 14 వేల కార్గో షిప్లు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి.
తూర్పు ఆసియా మరియు అమెరికాల మధ్య చాలా వాణిజ్యం ఈ మార్గం ద్వారానే జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ కాలువను అమెరికా మరియు చైనాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. అదేవిధంగా అమెరికా పశ్చిమ తీరం యూరోప్ ఆఫ్రికా మరియు మధ్య ప్రాజ్య ప్రాంతాలకు అనుసంధానించడానికి ఇదే ఏకైక మార్గం.
డారియన్ గ్యాప్ కి తిరిగి వస్తే ఇది కొలంబియా మరియు పనామా మధ్య ఉంది అదే కొలంబియా, గత కొన్నేళ్లుగా హింస మరియు అస్థిరతలకు బాధితురాలిగా ఉంది. ఇక్కడ డ్రగ్ మాఫియా దక్షిణ అమెరికా మొత్తం ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో కొకైన్ లో ఎక్కువ భాగం కొలంబియాలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడి నుంచి సెంట్రల్ మరియు ఉత్తర అమెరికాకు అక్రమంగా రవాణా చేయబడుతుంది. అయితే ఈ డారియన్ గ్యాప్ కారణంగా స్మగ్లింగ్ చాలా కష్టంగా మారింది.
స్మగ్లర్లు పనామా కోస్ట్ గార్డ్ ఉన్న సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తరచుగా ఈ స్మగ్లర్లను పట్టుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇక్కడ రోడ్డు లేదా రైల్ నెట్వర్క్ నిర్మిస్తే కొలంబియా డ్రగ్స్ మాఫియా అక్కడి నుంచి పనామాకు చేరుకొని పనామా కెనాల్ ను పాడు చేసే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఇక్కడి నుంచి మెక్సికో అమెరికాలకు డ్రగ్స్ రవాణా చేస్తారు. అందుకే పనామా కొలంబియా ప్రభుత్వాలు ఇక్కడ రైలు రోడ్డు నెట్వర్క్ లో నిర్మించడానికి అంగీకరించిన అమెరికా ఇక్కడ ఎలాంటి అభివృద్ధిని అనుమతించదు.
ఇప్పుడు మనం డారియన్ గ్యాప్ ను అభివృద్ధి చేయకపోవడానికి చివరి కారణం అక్రమ వలసలను ఆపడం. వాస్తవానికి లాటిన్ అమెరికా ఆర్థికంగా రాజకీయంగా మరియు జీవన ప్రమాణాల వారీగా ఉత్తర అమెరికా కంటే చాలా వెనుకబడి ఉంది. దక్షిణ అమెరికాలోని చాలా దేశాలు అవినీతి, బలహీనమైన పాలన మరియు రాజకీయ అస్థిరతలకు గురవుతున్నాయి. దీని కారణంగా మిలియన్ల మంది ప్రజలు తమ దేశాలను మెరుగైన జీవితం కోసం విడిచిపెట్టాలని అనుకుంటున్నారు.
ఈ ప్రజలందరికీ ఇప్పుడు అమెరికా కంటే మెరుగైన ఎంపిక లేదు. ఇప్పుడు అమెరికా గత కొన్ని ఏళ్లుగా తమ ఇమిగ్రేషన్ పాలసీని చాలా స్ట్రిక్ట్ చేసింది. దీని తర్వాత ఈ వ్యక్తులకు మిగిలిన ఏకైక మార్గం పరిష్కారం వాళ్ళు అక్రమంగా అమెరికాలో చేరుకోవడం. కానీ దీని కోసం వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీని ద్వారా ఈ డారియన్ గ్యాప్ ను దాటాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం వేల మంది ఈ గ్యాప్ ద్వారా సెంట్రల్ అమెరికా తర్వాత మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తారు. కానీ ఈ మొత్తం మార్గంలో అతి పెద్ద అడ్డంకి కేవలం డారియన్ గ్యాప్ మాత్రమే.
డెంగ్యూ, మలేరియా, విష సర్పాలు, ల్యాండ్ స్లైడ్ వరదలు, బందిపోట్లు ఈ 10 రోజుల ప్రయాణంలో మీరు వీటన్నిటిని దాటాల్సి ఉంటుంది అంటే ఒక వీడియో గేమ్ లాగా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత ప్రమాదకరమైన మార్గం ఉన్నప్పటికీ ఈ గ్యాప్ ను దాటే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. పేదరికం మరియు ఆకలితో విసిగిపోయిన ప్రజలు దీన్ని లెక్క చేయడం లేదు. ఈ ప్రయాణంలో చాలా మంది చనిపోతారు. జీవించి ఉన్న వారిలో చాలా మంది మానసికంగా దెబ్బ తిన్నారు. ఆకలి ఒక వ్యక్తిని చాలా పనులు చేయించగలదు. ఈ పేద ప్రజలు అమెరికాకు చేరుకోకుండా ఆపడానికి ఈ డారియన్ గ్యాప్ లో రైలు రోడ్డు నెట్వర్క్ నిర్మించబడలేదు. బహుశా రాబోయే సంవత్సరాల్లో అది అలాగే ఉంటుంది.