Mystery Of Amazon

Mystery Of Amazon

అమెజాన్ అడవుల సృష్టి కథ | Mystery Of Amazon

మనందరికీ తెలుసు అమెజాన్ అడవి అంటేనే ఒక విచిత్రం, అంతేకాకుండా అక్కడ ఎన్నో రకాల వింత జీవులు కూడా ఉంటాయి. ఇప్పటికీ కొంతమంది అనుకుంటూ ఉంటారు అమెజాన్ అడవిలో డైనోసర్లు ఉన్నాయని. ఏమో అది నిజంగా నిజమేనేమో ఎవరికి తెలుసు ? ఎందుకంటే అమెజాన్ అడవి అన్నది,ఈ ప్రపంచంలోనే పెద్దది. ఇప్పటివరకు ఆ అడవి ప్రాంతంలో జస్ట్ 25% మాత్రమే మనకి తెలుసు మిగిలిన 75 శాతం మనకి తెలియనే తెలియదు. 

మరి అలాంటప్పుడు ఆ ప్రాంతంలో అంటే మిగిలిన 75% ప్రాంతంలో ఎలాంటి జంతు వాతావరణం ఉండుంటుంది ? అసలు ఈ 75% ప్రాంతంలో ఉన్న మిగిలిన అడవి ఎందుకు సీక్రెట్ గా ఉండిపోయింది ? శాస్త్రవేత్తలకు కూడా అక్కడ ఎలాంటి జంతువులు ఉన్నాయో ఎందుకు అంతుచిడం లేదు ?

ఒకసారి ఈ విశాలమైన అడవిని ఏరియల్ వ్యూ లో చూస్తే మనకు అర్థమవుతుంది. దట్టమైన చెట్లు కమ్ముకున్న అడవి చాలా భయంకరంగా మనకి కనిపిస్తుంది మరి ఆ లోపల ఎలాంటి జంతువులు ఉన్నాయో మనకు స్పష్టంగా తెలియదు. మనం ఇప్పుడు అసలు ఈ జంగిల్ లోపల ఏమున్నాయో తెలుసుకుందాం.

నిజంగా అమెజాన్ అడవి ఒక అద్భుతం. అందమైన విశాలమైన అడవి ప్రాంతం. దట్టమైన చెట్లు ఉంటాయి. అందుకే అనకొండ లాంటి అతి పెద్ద పాము జాతి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అనకొండ మాత్రమే కాదు, ఈ అడవిలో ఇంకా అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. మన సినిమాల్లో చూసినట్టు రకరకాల వింత పాములు ఇక్కడే ఉన్నట్టు చాలా మంది చెప్తూ ఉంటారు. వింత కోతులు, ప్రమాదకరమైన చీమలు, పాములు ఈ అడవి ప్రాంతంలో హాయిగా తిరుగుతూ ఉంటాయి. 

ఈ అమెజాన్ అడవి ప్రాంతం మొత్తంలో మనం ఇప్పటివరకు జస్ట్ 25% మాత్రమే చూడగలిగాం. మరి మిగిలిన ప్రాంతాన్ని మనం ఎందుకు చూడలేకపోయాం ? అసలు ఆ ప్రాంతం ఎక్కడుంది ? ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి ఇప్పటివరకు ఎందుకు సాహసించలేకపోతున్నారు ? మరి దీనికి సమాధానం చెప్పాలంటే ఈ అడవిలో వాతావరణం అన్నిటికంటే డిఫరెంట్. మొత్తంగా చెప్పాలంటే అనుకూలమైన వాతావరణం ఈ అమెజాన్ అడవిలో ఉండనే ఉండదు.

ఒకవేళ ఒకవేళ ఈ ప్రాంతంలోకి వెళ్ళాలి అనుకుంటే ఎన్నో రకాల హై టెక్నాలజీ మిషన్స్ ను తీసుకువెళ్లాలి. అంతేకాకుండా ఈ అడవిలో విచిత్రమైన జంతువులే కాదు, ఇంకా ఆదివాసి మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. ఊహించని వాళ్ళు కూడా మనకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 

మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, amazon అడవి ఎంత అద్భుతంగా విచిత్రంగా ఉంటుందో. ఈ amazon అడవిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఈ అడవి పైన పరిశోధనలు చేస్తూనే ఉంటారు. 2017 లో లీడ్స్ యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది.

ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే అమెజాన్ అడవిలో కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్లే ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తున్నారు. కార్లోస్ నోబెల్ అనే ఒక సైంటిస్ట్ చెప్పిన ప్రకారం ఈ మధ్యకాలంలో చాలా మంది అమెజాన్ అడవి ప్రాంతాన్ని కూడా తగ్గించుకుంటూ వెళుతున్నారని, అంటే అడవిలో ఉన్న మొక్కలన కొట్టివేస్తూ ఉన్నారని, ఇది ప్రపంచానికి చేదు కబురు అని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే దాదాపుగా 20% ఆక్సిజన్ ఈ ప్రపంచానికి అమెజాన్ అడవి నుంచే దక్కుతుంది. ఇక ఈ అమెజాన్ అడవిలో ఉన్న జంతువుల గురించి చెప్పాలంటే ఎక్కడా చూడని జంతువులు ఈ అడవిలోనే ఉంటాయి. మీరు చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడూ చూడని ఒక జంతువు మీకు కనిపిస్తుంది అనుకోండి అది ఖచ్చితంగా అమెజాన్ అడవిలో మాత్రమే ఉంటుంది. అక్కడ చెట్లు కూడా చాలా పెద్ద సైజులో, లావుగా, దట్టంగా కమ్ముకొని ఉంటాయి. 

16 వేల రకాల చెట్లు అక్కడ ఉన్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి అక్కడ ఎలాంటి క్రిమి కీటకాలు పాములు, తేళ్లు, జర్రులు, రకరకాల జీవులు అక్కడ జీవిస్తూ ఉంటాయి. ఒక ఒకవేళ అవి గనక మనిషిని కుట్టాయి అనుకుంటే, ఆ క్షణమే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇవి చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ దీని నోటి లోపల అత్యంత ప్రమాదకరమైన విషం దాగి ఉంటుంది. చీమలే కాదు, ఈ అడవిలో ఉన్న సాలిపురుగులు కూడా చాలా ప్రమాదకరం. విషపూరితంగా కూడా ఉంటాయి. అవి ఒకవేళ మనిషిని గనుక ఈ సాలిపురుగులు కుడితే చనిపోయే ప్రమాదమే ఎక్కువ. చూడ్డానికి ఈ సాలిగూడులు చాలా చిన్నవిగా కనిపిస్తున్న వీటి పైన ఉన్న వెంట్రుకలే ప్రమాదకరం. ఈ వెంట్రుకల్లో కూడా చాలా విషం దాగి ఉంటుంది ఒకవేళ జస్ట్ కంటి దగ్గర కుట్టిన కన్ను పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అసలు ఇంతకీ ఈ అమెజాన్ అడవి ఎలా ఏర్పడింది ? ఒకవేళ దీనికి సమాధానం మీరు తెలుసుకుంటే షాక్ తింటారు ! 

అయితే కొన్ని కథల ప్రకారం ఈ అమెజాన్ అడవి ఎలా ఏర్పడింది అంటే, ఒక ఆస్ట్రోనాట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పడిందని, అప్పుడే డైనోసర్లు పుట్టాయి అంటారు. డైనోసర్లే కాకుండా అత్యంత భయంకరమైన జంతువులు కూడా అప్పుడే పుట్టాయట. ఆస్ట్రాయిడ్ ఎప్పుడైతే నేలపై పడిందో అప్పుడు కొంత ప్రాంతం అంతా మంటల్లో మాడి మసైపోయిందట. ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు, చెట్లు అన్నీ కూడా చనిపోయాయట.

అదే టైం లో ఆస్ట్రాయిడ్ పేలుడు వలన సంభవించిన బూడిద అంతా వాతావరణంలో పూర్తిగా కలిసిపోయింది. కొన్నేళ్ల పాటు ఎటు చూసినా దుమ్మే తప్ప మరేం కనిపించేది కాదు. అయితే అప్పటికే ఉన్న డైనోసర్లు కొన్ని చనిపోతే కొన్ని మాత్రం బ్రతికి బట్టకట్టాయి. ఆ తర్వాత కొంతకాలానికి నెమ్మదిగా సూర్య కిరణాలు నేలపై పడటం మొదలు పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా భూమిపైన చెట్లు రావడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా జంతువు జంతువులు కూడా పుట్టుకొచ్చాయి. ఎక్కడైతే జంతువులు ఉన్నాయో ఆ ప్రాంతమే అమెజాన్ అడవి అయింది.

ఈ ప్రాంతం ఇక్కడ చాలా దట్టంగా ఉండడంతో అక్కడ డైనోసర్లు ఉండేవట. అందుకే ఈ ప్రాంతం దరిదాపుల్లో కూడా మనుషులు ఉండేవారు కాదు. డైనోసర్లు అంటే అందరికీ ఒళ్ళు జలధరిస్తుంది. అయితే డైనోసర్లలో అన్ని ప్రమాదకరంగానే ఉండవు. అందులో కొన్ని సాధు జంతువుల కూడా ఉంటాయి, ఈ అడవిలో ఉన్న చెట్ల ఆకులు తింటూ ఈ డైనోసర్లు బ్రతికేవి. అయితే ఆ తర్వాత కాలంలో డైనోసర్లు నెమ్మది నెమ్మదిగా అంతరించిపోయి అడవిలో మిగతా జీవులు పెరగడం మొదలయ్యాయి. చాలాసార్లు ఈ అడవి లోపల ఉల్కలు పడ్డాయి. దీనివల్ల అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న డైనోసర్లు వంటి జంతువులు కాలక్రమేణ అంతరించిపోయాయి. 

అయితే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మళ్ళీ అడవి మొక్కలతో నిండిపోవడం మొదలైంది. ఈ ప్రాంతంలో తరచు ఉల్కలు పడటం వల్ల ఈ నేల బలంగా తయారైందట. ఫెర్టిలైజింగ్ ల్యాండ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మొక్కలు బలంగా పెరుగుతాయి. జంతువులు కూడా ఈ వాతావరణం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాయి. జంతువులు తినేంత, మొక్కలను హరించేంత ప్రమాదకరమైన జంతువులు ఈ అడవిలో లేవు. అందుకే అమెజాన్ అడవి దట్టంగా పెరిగింది.

ఇప్పటికే అమెజాన్ అడవి కూడా ఆక్రమణకు గురవుతోంది. అయితే మనం చూడని ఆ 75% అడవి ప్రాంతంలో ఏముంది అంటే సస్పెన్స్ !

ముగింపు

ఏమో ఎవరికీ తెలుసు ఉల్కలు ఈ అడవి లోపల పడిన తర్వాత వింత జీవులు ఏమైనా పుట్టుకొచ్చాయేమో ? ఏలియన్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది ఎవ్వరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆ 75% అడవిని కనిపెట్టేది ఎవరు అంటే, కాలక్రమేణ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ 75% అడవిని అన్వేషిస్తారే తప్ప, ఎప్పటికిప్పుడైతే ఆ 75% amazon అడవి మిస్టరీ గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *