Journey to Antarctica at the end of the earth

Journey to Antarctica at the end of the earth

భూమి చివర అంటార్కిటికా కి ప్రయాణం | Journey to Antarctica at the end of the earth

ఈ భూమి మీద అత్యంత శీతల ప్రాంతం అంటార్కిటికా అని అందరికీ తెలుసు. నిజంగా ఇంతకంటే శీతల ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా లేదు. అంతేకాదు అక్కడ ఉన్నంత మంచు కొండలు ఇంకెక్కడా ఉండవు. ఆ ప్రాంతంలో ఎంత మంచు ఉందంటే ఈ ప్రపంచాన్ని ప్రళయంతో ముంచేటంత మంచు. అసలే ఎంతో ఎత్తులో ఉండే మంచు ప్రాంతం, ఇది గనుక కరిగితే ఒక్కసారిగా ప్రపంచం మునిగిపోతుంది. అక్కడ గాలులు 300 km స్పీడ్ తో వీస్తూ ఉంటాయి. అంటే ఒక బిల్డింగ్ ని ఈజీగా కూల్చేంత వేగంతో అన్నమాట. 

ఈ భయంకరమైన మంచు ప్రాంతంలో ఒక్క జీవి కూడా కనిపించదు. ఏ దేశానికి చెందిన ప్రజలు కూడా అక్కడికి వెళ్లరు. అయితే అక్కడ ఏలియన్స్ ఉన్నట్లు కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఆ ప్రాంతాన్ని ఏలియన్స్ ఉండే ప్రాంతం అని అంటున్నారు. ఇవే కాదు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ అంటార్కిటికాలో ఉన్నాయి. 

ఈ భూమి పైన ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికా ఒక ఖండం. ఈ ప్రాంతం మీద ఏ దేశానికి శాశ్వత అధికారం లేదు. దగ్గరగా ఉన్న దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, చిలి అలాగే అర్జెంటీనా దేశాలు ఈ ప్రాంతాన్ని తమది అన్నట్టుగా చెప్తుంటాయి. అయితే అధికారికంగా అది ఎక్కడా లేదు. ఈ ప్రాంతం అంతా మంచుతో నిండి ఉండడం వల్ల అంటార్కిటికాని మంచు ఎడారి అని అంటారు. ఇక్కడ వర్షపాతం 200 mm కంటే తక్కువగా నమోదయి అసలు వర్షాలే కురవనట్లే ఉంటుంది.ఒకవేళ వర్షం పడిన అది మెల్లమెల్లగా స్నో టైప్ లో మంచు వర్షంగా అయిపోతుంది. 

అంటార్కిటికాలో తూర్పు భాగం, పశ్చిమ భాగం కంటే ఎత్తుగా ఉండి ఎక్కువ శీతలంగా ఉంటుంది. ఇక్కడ టైం జోన్ అంటూ ఏమి ఉండదు. ఇక్కడ ముఖ్యంగా రెండు దక్షిణ ధ్రువాలు ఉంటాయి. మీరు గ్లోబ్ ని చూసినట్లయితే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంలో స్థిరంగా ఉండే ఒక పాయింట్ వద్ద కలుస్తుంది, మిగిలినవి అటు ఇటుగా కదులుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ అస్తమయం అంటూ ఏమి ఉండదు. శీతాకాలంలో ఇక్కడ ఎన్నో వారాలు సూర్యోదయం అనేది ఉండదు. అలాగే ఎండాకాలంలో డిసెంబర్ చివరి నుంచి మార్చి చివరి వరకు సూర్యాస్తమయం అన్నది జరగదు. 

ఈ ధ్రువ కేంద్రం గురించి ఇంకా చెప్పాలంటే, ఇక్కడ ఆరు నెలలు సూర్యోదయం అన్నమాటే ఉండదు. ఇక్కడ ఆరు నెలల పొడుగున సాగే ఎండాకాలం రోజులో ఏ సమయంలోనైనా మన సూర్యున్ని హారిజాన్ మీద మన వాచ్ యాంటినా క్లాక్ దశలో తిరుగుతూ గమనించవచ్చు. అయితే మనం దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడం చాలా కష్టం. ఇక్కడ సముద్రం మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ దక్షిణ ధ్రువ కేంద్రం సైంటిస్టులు నివసించే ప్రాంతానికి చాలా దూరంగా చాలా ఎత్తులో ఉంటుంది అక్కడికి వెళ్లాలనుకునే వారికి మంచుతో కప్పబడిన సముద్రపు దారిలో వెళ్లాల్సి ఉంటుంది. 

దక్షిణ ధ్రువం అంచుకు చేరుకున్న కేంద్ర బిందువు వద్దకు వెళ్ళాలంటే మరో 1600 km లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక మంచు సర్ఫేస్ గురించి చెప్పాలంటే, లక్షల సంవత్సరాల పురాతనమైన 19 km వెడల్పులో ఈ మంచు ఉపరితలు ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన ఉష్ణోగ్రతలు, బీడు భూములు ఎక్కువగా ఉండేవని చెబుతారు. బీడు భూములు ఇప్పటికీ ఉన్న తక్కువ శాతంలో ఉండడం, ప్లేట్లెట్లు జరగడం, అలాగే కొన్ని నేచర్ లో వచ్చే మార్పుల కారణంగా ఈ ప్రాంతం మంచు ఎడారిగా మారిందని అంటారు. 

రెండవ కారణం సూర్యకాంతి చాలా తక్కువగా ఉండడం. ఈ కారణంగానే భూమి మీద సుమారుగా 90% మంచు కేవలం రెండు ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి గ్రీన్ లాండ్ రెండవది అంటార్కిటికా. ఈ భూమిలో 70% తాగడానికి పనికొచ్చే వచ్చే మినరల్ వాటర్ లాగా నీరు మంచు రూపంలో ఘనిీభవించి అంటార్కిటికా లోనే ఉంది. ఏ కారణం చేతనైనా అక్కడ మంచు రూపంలో ఉన్న నీరు కరిగితే మాత్రం భూమి మీద ఉన్న సముద్రం 60% పొంగి పొర్లుతుంది. అప్పుడు భూమి మీద చాలా భూభాగం రూపురేఖలే మారిపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయని కూడా చెప్తున్నారు సైంటిస్టులు. 

అలాగే అంటార్కిటికాలో క్లైమేట్ ఎలా ఉందంటే, ఎండాకాలం ఉష్ణోగ్రత -10 నుంచి -15 డిగ్రీల సెల్సియస్ వరకు అలాగే శీతాకాలం -60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక ఇక్కడ అతి తక్కువగా -82° ఉష్ణోగ్రత నమోదై ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతంగా ఈ ప్రాంతం గుర్తించబడింది. అలాగే అంటార్కిటికాలో ఎవరు నివసించరు. అక్కడ నివసించడానికి అనుమతి కూడా లేదు. అయితే పర్మిషన్ తీసుకొని చూసి రావడానికి మాత్రం అక్కడికి వెళ్లొచ్చు. అయితే ఇది భారతదేశంలో సహా ప్రపంచంలోని అన్ని దేశాల సైంటిస్టులకి రీసెర్చ్ సెంటర్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా సైంటిస్టులు ఉండి అన్వేషణ జరుపుతారు. 

ఇదిలా ఉంటే 1959 లో ఏర్పరచుకున్న అంటార్కిటికా మ్యూచువల్ అగ్రీమెంట్ ప్రణాళిక ద్వారా 30 దేశాలు ఒక అగ్రీమెంట్ కి వచ్చాయి. ఇందులో విధించుకున్న షరతులు ఏంటంటే ఎటువంటి సైన్యం ఇక్కడ ఉండకూడదు. అలాగే ఎలాంటి అణు పరీక్షలు ఇక్కడ జరపకూడదు. మొత్తంగా చెప్పాలంటే ఏదైనా ప్రయోగం జరిపి ఈ ప్రాంతాన్ని పాడు చేయకూడదు అన్నమాట. ఇక ఇక్కడ రీసెర్చ్ స్టేషన్ లో ఎండాకాలం 5000 మంది వరకు, అదే చలికాలంలో అయితే 1000 మంది లోపే సైంటిస్టులు ఉంటారు. ఇక్కడ పేరుకుపోయిన మంచులో వచ్చే మార్పులు వాతావరణంలో వచ్చే మార్పులను సైంటిస్టులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. దాదాపు

అక్కడ 80 కి పైగా రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. 

అంటార్కిటికాలో మంచుతో కప్పబడిన సముద్రం ఉందని మనం చెప్పుకున్నాం కదా. స్నో లేయర్ ఉంటుంది, కానీ ఈ సముద్రం నుంచి వచ్చే గాలులను మాత్రం మనుషులు ఎవరు తట్టుకోలేరు. అంత భయంకరంగా ఉంటాయి. అక్కడ చూడడానికి వెళ్ళిన వారిలో లేక అక్కడున్న సైంటిస్టులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ భూమిని హడలు పెట్టించే గాలి, ఇక్కడ గంటకు 200 మైళ్ళ స్పీడ్ తో వీస్తుంది. అంటే అది ఎంత ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోండి. 

అయితే మనుషులే కాదు అక్కడ ఏ జీవులు కూడా ఉండవంటారు. అయితే పెంగ్విన్స్ ఈ పక్షులు మాత్రమే అంటార్కిటిగా పశ్చిమ భూభాగంలో ఉండగలుగుతున్నాయి. అయితే దీనికి రీసన్ ఉంది. వాటి శరీరం అక్కడి ఉష్ణోవ్రతకు తగ్గట్టుగా ఉంటుంది. సముద్రంలో దొరికే చేపలు ఇతర జీవాలను అవి ఆహారంగా తీసుకుంటాయి. సముద్రంలో కూడా ఈజీగా ఈదుతూ ఈ పక్షులు తిరుగుతాయి. ఈ పక్షులు ఎగరవన్న సంగతి తెలుసు కదా, అందుకే అందమైన క్యాట్ వాక్ చేసుకుంటూ ఈ మంచు లోయలు తిరుగుతూ ఉంటాయి. ఈ మంచు కొండలోనే గుడ్లు పెట్టి పొదిగి వాటి సంతానాన్ని పెంచుకుంటాయి. పొదిగే సమయంలో అవి చాలా కష్టాలను చూస్తాయి, అయినా వాటి ప్రత్యుత్పత్తిని ఆపవు. ఒక మంచి పేరెంట్స్ లో ఉంటాయి అవి.

అయితే అక్కడ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ అలాగే కరుగుతున్న మంచు కొండల వల్ల వీటి మనుగడ విషయంలో సైంటిస్టులు బాధపడుతున్నారు. ఈ పెంగ్విన్స్ తో పాటు సీల్ నిమిలోడ్స్ వంటి ఇతర జీవులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో న్యూజిలాండ్ ,అంటార్కిటికా ఈ రెండు ప్రాంతాలు కూడా అసలు పాములే లేని ప్రాంతాలు. 

ఇదిలా ఉంటే కొంతమంది అక్కడ ఏలియన్స్ ఉంటారు అంటారు. అందుకే దీన్ని ఏలియన్స్ ఏరియా అని కూడా పిలుస్తారు. అయితే ఏలియన్స్ గుర్తులు చూసామని కొందరంటే అటువంటి ఆధారాలు ఏమి దొరకలేదని సైంటిస్టులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *