How Sim Card Made

How Sim Card Made

Sim Card ఎలా తయారు చేస్తారు మరియు అది ఎలా పని చేస్తుంది? | How Sim Card Made ?

ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారో తెలుసా ? సెల్ ఫోన్ ! ఎస్ రైట్ చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా సెల్ ఫోన్ తప్ప ఇంకా దేన్ని ఇష్టపడటం లేదు. ఏం కాదంటారా మీరు కాదని ఎందుకు అంటారులే ఎందుకు ఇప్పుడు ఎవరిని చూసినా సెల్ ఫోన్ తో గడిపినంతగా పక్క వాళ్ళతో గడపడం మానేశారు. ఇది పక్కన పెడితే అసలు సెల్ ఫోన్ పని చేయాలంటే ఏం కావాలి ? సిమ్ కార్డు !  అవును సిమ్ కార్డు లేకపోతే సెల్ ఫోన్ పని చేయదు. అసలు ఇంతకీ ఈ సిమ్ కార్డు ఎలా తయారు చేస్తారు? అది ఎలా పనిచేస్తుంది? 

సిమ్ కార్డు లేకపోతే సెల్ ఫోన్ ఒక డబ్బా. డబ్బా మాత్రమే కాదు ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ థింగ్. అదే సిమ్ కార్డు ఉంటే ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళతో అయినా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ సిమ్ కార్డు ను ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. దీని తయారీలో ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తారో కూడా తెలియదు. 

మనం ఇప్పుడు 5g సిమ్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నాం కదా. అవే మనం సిమ్ కార్డు ను మన ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వేసేటప్పుడు సిమ్ కార్డ్ కి ఉన్న కవర్ తీసి సెల్ ఫోన్ లో పెడతాం. ఈ కవర్ ఒక రకమైన పదార్థంతో తయారు చేస్తారు, అంటే ఈ సిమ్ కార్డ్ బాడీని వేస్ట్ ప్లాస్టిక్ తో ఒక పద్ధతిలో తయారు చేసి ముందుగా ప్లాస్టిక్ యొక్క కనికలను ఒక దగ్గర ఉంచుతారు. ఆ తర్వాత మాస్టర్ బ్యాచ్ ని అందులో వేస్తారు. 

అయితే మీకు ఈ మాస్టర్ బ్యాచ్ అంటే ఏంటో తెలియదు కదా. దీనివల్ల ప్లాస్టిక్ పదార్థానికి ఒక పర్టికులర్ కలర్ వస్తుంది, అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నమాట. అప్పుడు ఈ రెండు పదార్థాలను ఒక మిషన్ సాయంతో మిక్స్ చేసి దాన్ని హీట్ చేస్తారు. ఈ మిషన్ మిక్సింగ్ అలాగే హీటింగ్ లో సహాయం చేస్తుంది. ఈ మిషన్ లోపల హీట్ అయ్యే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే, ఇక్కడ ఉండే ప్లాస్టిక్ కణికలు నెమ్మది నెమ్మదిగా ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంలోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ మిషన్ నుంచి బయటకు వచ్చేది ఏంటో తెలుసా, పెద్ద పెద్ద ప్లాస్టిక్ షీట్స్.

జస్ట్ ఒక రెండు పదార్థాలను ఈ మిషన్ తన లోపలికి తీసుకుని ఆ తర్వాత ఒక షీట్ రూపంలో బయటకు విడుదల చేస్తుంది. ఆ తర్వాత మరో మిషన్ ఈ ప్లాస్టిక్ షీట్ ను, అంటే కావాల్సిన విధంగా కార్డ్ ఒక రూపంలోకి తయారవుతుంది. మైక్రో సిమ్ అలాగే మ్యాక్రో సిమ్ అని వీటిని పిలుస్తూ ఉంటాం, అది మీరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి మిషన్లలో తయారు చేసినవే. కాదంటే ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. అంతేకాదు సిమ్ లో ఉండే గ్లూ ని కూడా మిషన్స్ తయారు చేస్తాయి. సిమ్ కార్డ్ సెల్ ఫోన్ లో ఫిట్ అయితేనే మనకు నెట్వర్క్ వస్తుంది. 

అంటే సిమ్ కార్డ్ సెల్ ఫోన్ లో ఫిట్ అవ్వాలంటే దానికి ఈ గ్లూ అవసరం ఇలా ఫిట్ అయిన వెంటనే ఇంకేముంటుంది ధనాధన్మని మనకు నచ్చినట్టు మన సిమ్ లో ఎవరికి కావాలంటే వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు సిమ్ కార్డ్ కవర్లు గ్లూ చూసాం, దాని మధ్యలో ఉండే సిమ్ ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. 

ఈ సిమ్ ప్రిపేర్ చేయాలంటే కచ్చితంగా కంప్యూటర్ కావాలి. అలాగే అందులో ప్రోగ్రామింగ్ ఉండాలి. కంప్యూటర్  సిమ్ కార్డ్స్ లో ప్రోగ్రామింగ్ ను ఫిక్స్ చేస్తూ వాటిని రెడీ చేస్తూ ఉంటుంది ఇలా ప్రోగ్రాం ఫిక్స్ చేసిన తర్వాత గోల్డెన్ చిప్ లతో సిమ్ కార్డులను రెడీ చేస్తారు. ఈ గోల్డెన్ చిప్ పై భాగం సిలికాన్ తో తయారవుతుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ కానీ సిమ్ కార్డుల స్ట్రక్చర్ అన్ని కంపెనీలకు ఒకేలా ఉండవు. ఒక్కొక్క కంపెనీ స్టైల్ డిజైన్ ఒక్కోలా ఉంటుంది. ఈ విధంగా సిలికాన్ కోటింగ్ తో గోల్డెన్ చిప్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు సిమ్ కార్డు రెడీ అయింది. ఇక అది ఎలా పనిచేస్తుందో చూద్దాం.

 అసలు సిమ్ కార్డు లో ఎటువంటి మంత్రం ఉండదు. సముద్రాల అవతల లో ఉన్న వారితో కూడా క్షణాల్లో ఫోన్ చేసి మాట్లాడేయొచ్చు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఈ చిన్న చిప్ కలిపేస్తుంది. చూడ్డానికి ఈ సిమ్ మన చిటికిన వేలంతా కూడా ఉండదు. మరి ఇంత చిప్ ఎలా అంత దూరంగా ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేస్తుంది. అంటే అంత పెద్ద డేటా ఈ సిమ్ లో ఎలా స్టోర్ చేస్తారు అంటే ప్రతి సిమ్ లో ఐ సిసి ఐడి ఉంటుంది. అంటే సెక్యూరిటీ అన్నమాట. ఇది ఈ సిమ్ కార్డు లో ఉండడం వల్ల ఎప్పుడైతే సిమ్ లో దీన్ని సెట్ చేస్తామో అప్పుడు కనెక్షన్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంటర్నేషనల్ మొబైల్ ఐడెంటిటీ కూడా ఉంటుంది. ఈ సిమ్ కార్డు లో పర్సనల్ ఐడెంటిటీ, అలాగే సెక్యూరిటీ పిన్ కూడా ఉంటుంది. 

ఈ సిమ్ కార్డులలో రెండు రకాల టెక్నాలజీస్ ని పిన్ చేసి పెడతారు అందులో మొదటిది జిఎస్ఎం, రెండోది సిడిఎంఐ. వీటిని బట్టి సిమ్ కార్డులు పనిచేస్తాయి. ఇంకా క్లియర్ గా సిమ్ కార్డు ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలంటే… 

మొదటిగా మనం సిమ్ కార్డు ను ఫోన్ లో సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత ఫోన్ లో నెట్వర్క్ వచ్చినట్టు మనకు సిగ్నల్ వస్తుంది. అప్పుడు దీనికి దగ్గరలో ఉన్న csm నెట్వర్క్ ఎక్కడుందో వెతుక్కుంటుంది. ఎప్పుడైతే అది దొరుకుతుందో అప్పుడు ఫుల్ నెట్వర్క్ సెల్ ఫోన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే మనం అవతల వారికి ఫోన్ చేస్తామో అప్పుడు ట్రాన్స్లేటర్ ద్వారా ఫోన్ కనెక్ట్ అవుతుంది. దీంతో మనం హాయిగా అవతల వాళ్ళతో మాట్లాడొచ్చు. 

ఈ సిమ్ కార్డుల కంపెనీలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అవేనండి మనం నిత్యం వినే ఎయిర్టెల్, bsnl, jio, vodafone ఇలా ఇంకా చాలా కంపెనీలు. ఇప్పుడు మీకు అర్థమైందా మీ దగ్గర ఉన్న సిమ్ లను ఒక్కసారి చూడండి. అందులో ఉన్న వేరియేషన్ ను పరిశీలించండి. ఒక్కో కంపెనీ సిమ్ ఒక్కో డిజైన్ లో ఉంటుంది. ఈ కంపెనీలన్నీ తమ సిమ్ కార్డులను కొనుక్కోవాలనే ఉద్దేశంతో రకరకాల ఆఫర్లు పెట్టి పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మీరు కూడా అలాంటి ఆఫర్లు చూసి మీ సిమ్ ను కొనే ఉంటారు కదా.

మీ చుట్టుపక్కల ఎక్కడైనా పెద్ద ఎత్తులో ఉండే మొబైల్ టవర్ ని చూసారా. ఈ టవర్లే సిమ్ కార్డులను కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఇది సిమ్ కార్డు లోపల ఉంటుంది. మీ సిమ్ కార్డు ను ఒక పాస్వర్డ్ సహాయంతో ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే సిమ్ కార్డు ను వేరే ఒక ఫోన్ లో వేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక సిమ్ కార్డుల సైజుల విషయానికి వస్తే నెమ్మది నెమ్మదిగా సిమ్ కార్డుల సైజులు తగ్గిపోతున్నాయి. 

ఇప్పుడైతే బాగా చిన్న సైజులో సిమ్ కార్డులు వస్తున్నాయి, అంటే స్మార్ట్ ఫోన్ లో స్మార్ట్ సిమ్ కార్డు అన్నమాట. అదే గతంలో వచ్చిన ఫోన్ లో ఉండే సిమ్ కార్డులను చూస్తే కాస్త భిన్నంగా పెద్దవిగా ఉండేవి. సిమ్ లను సిమ్ మైక్రో మైనో సిమ్ అని పిలుస్తున్నారు. మొబైల్ ని బట్టి సిమ్ కార్డు సైజు మారుతుంది. ఇప్పుడైతే అన్ని మ్యాక్రో సిమ్ కార్డులు వస్తున్నాయి. ఇదే అన్నిటికంటే హై టెక్నాలజీ సిమ్ అన్నమాట. మరి ముందు ముందు కాలంలో ఇంకెలాంటి సిమ్ కార్డులు వస్తాయో అసలు సిమ్ లేకుండానే మొబైల్ లోనే డైరెక్ట్ గా కనెక్టివిటీ వస్తుందేమో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *