No flying zone

విమానాలు ఎగరకూడని ప్రదేశాలు | No flying zone
ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని విమానాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇవన్నీ ఎలా తిరుగుతుంటాయో మీకు తెలుసా ? కొన్ని ప్రాంతాల్లో ఈ విమానాలు తిరగడాన్ని బ్యాన్ చేశారు. అలా ఎందుకు చేశారు ?
నో ప్లేన్ జోన్ అంటే విమానాలు వెళ్ళ కూడని ప్రాంతం. సాధారణంగా ఇంటెలిజెన్స్ సైనిక స్థావరాలు లేదా దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలకు ఈ నియమం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఆరు ప్రాంతాలు అలాంటివి కానే కావు. అయినప్పటికీ వాటి పై నుంచి విమానాలు ఎగరకుండా నిషేధించారు. మరి అవేంటో ఎందుకో తెలుసుకుందాం.
నెంబర్ సిక్స్ టిబెటిన్ ప్లాటో
టిబెటెన్ ను ప్రపంచ పై కప్పు అని పిలుస్తారు. అదేనండి రూప్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రాంత విస్తీర్ణం దాదాపుగా 25 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తంగా తొమ్మిది దేశాలు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం నుంచి విమానాల్లో వెళితే చాలా దేశాలకు చాలా తొందరలో వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఈ టిబెటన్ ప్లాటో మీదుగా వెళితే ఇటు యూరోపా దేశాలు, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా దగ్గర. కానీ ఏరియాను పూర్తిగా బైపాస్ చేసి ఆయా దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
దీనికంతటికీ ముఖ్య కారణం ఇక్కడ చాలా ఎత్తైన పర్వతాలు ఉండడం. ప్రపంచంలోని రెండు ఎత్తైన శిఖరాలైన ఎవరెస్ట్, కేటు ఈ రెండూ కూడా ఇక్కడే ఉన్నాయి. సాధారణంగా విమానాలు ఎగిరే వాటికంటే ఈ శిఖరాలు చాలా ఎత్తులో ఉన్నాయి. దీనివల్ల విమానాలు ఇంకా పైకి వెళ్లి ఈ శిఖరాల పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే టిబెట్ లో విమానాలు ఎగిరేందుకు పర్మిషన్ లేదు. ఒకవేళ ఎగిరి ఇంజన్ లోపం వచ్చి కూలితే
పర్వతాలపై పడుతుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఎటువంటి సురక్షితమైన ప్రదేశం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో విమానాలు తిరగకుండా నిషేధించారు.
నెంబర్ ఫైవ్ వాల్కనోస్
2022 జనవరి సౌత్ పసిఫిక్ ఓషన్ కు దగ్గరలో ఉన్న టోంగా అనే ఒక చిన్న ఐలాండ్ లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే అక్కడున్న అండర్ వాటర్ వాల్కను ఒక్కసారిగా పేలింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఒక్కసారిగా దుమ్ము, దూళితో నిండిపోయింది. ఆకాశాన్ని అంటుకున్నట్టుగా దుమ్ము మేఘాలుగా కమ్ముకుంది. అది ఎంతలా అంటే అప్పటివరకు ఏ వాల్కనో నుంచి విడుదల కాలేనంత దుమ్ము, దూళి అంటే దాదాపుగా ఆకాశంలోకి 190000 అడుగుల ఎత్తులోకి ఈ దుమ్ము చేరి మేఘంలా కమ్ముకుంది. దీంతో ఈ వోల్కను బ్లాస్టింగ్ రికార్డ్ సృష్టించింది. సాటిలైట్ కు ఈ పేలుడు అంతుచిక్కలేదు. మరి ఇంత ఎత్తులో దుమ్ము, దూళి పేరుకుపోతే అటుగా విమానాలు వెళ్ళలేవు కదా. ఒకవేళ వెళ్ళిన ఈ ఓల్కను డస్ట్ క్లౌడ్స్ విమాన అద్దాలను పగలగొడుతుంది. అలాగే ఇంజన్ కూడా పాడైపోయే అవకాశం ఉంది.
1982 జూన్ 24న లండన్ నుంచి న్యూజిలాండ్ వెళ్తున్న ఒక విమానం ఒక వాల్కనిక్ క్లౌడ్ ను క్రాస్ చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఆ విమానంలోకి ఈ స్మోక్ విపరీతంగా చేరిపోయింది. అప్పుడు సిబ్బందికి ఈ దుమ్ములో సల్ఫర్ స్మెల్ వచ్చింది. అదేంటో తెలుసుకునే లోపే ఇంజిన్ లోకి కూడా వాల్కనో క్లౌడ్ చేరిపోయింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని ఇంజన్లు ఆగిపోవడం మొదలయ్యాయి. అప్పుడు వెంటనే పైలట్ అప్రమత్తమై 17000 అడుగుల నుంచి 12000 అడుగుల వరకు ఒక్కసారిగా విమానాన్ని దించేశాడు. అప్పుడు విమానంలో ఉన్న నాలుగు ఇంజిన్లలో మూడు ఇంజన్లు స్టార్ట్ కావడం మొదలు పెట్టాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందుకే వోల్కన హౌస్ మీద నుంచి విమానాలు వెళ్లకుండా నిషేధించారు.
నెంబర్ ఫోర్ క్రేటర్
క్రేటర్ అంటే బిలం లేదా ఒక పెద్ద రంద్రం. ఇవి భూమిపై అక్కడక్కడ ఏర్పడతాయి. వీటిపై విమానాలు ప్రయాణించడం బ్యాన్. ఇలాంటివి దాదాపుగా భూమిపై 170 కు పైగా ఉన్నాయి. మైనింగ్ వల్లనో లేదా నేచురల్ గా ఏర్పడటం వల్లనో ఈ క్రేటర్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, అతి పెద్ద క్రేటర్స్ కంటే చిన్న క్రేటర్స్ చాలా డేంజర్. ఒకవేళ ఈ చిన్న క్రేటర్స్ పై విమానాలు తిరిగితే అప్పుడు ఈ విమానాలను ఈ క్రేటర్స్ తన లోపల లాగేసుకుంటాయి. ఆ పవర్ వాటికి ఉంటుంది. ఎందుకంటే క్రేటర్ భూమి అడుగు భాగం వరకు ఉంటుంది. ఈ లోపల భాగంలో ఉండే హీట్ పైకి వేడి గాలిను పంపుతుంది.
అదేవిధంగా బయట ఉన్న చల్లని గాలి క్రేటర్ లోపలికి వెళుతుంది. ఈ చల్లని వేడి గాలిల మధ్య జరిగే ఘటనలతో ఆ ప్రాంతంలో వాటెక్స్ ఎఫెక్ట్ అవుతుంది దీనికి. దానిపై తిరిగే దేన్నైనా సరే దానిలో కలిపేసుకునే శక్తి ఉంటుం.ది అందుకే విమానాలు ఈ క్రేటర్స్ పైన వెళ్ళడాన్ని బ్యాన్ చేస్తారు.
నెంబర్ త్రీ నార్త్ కొరియా
నార్త్ కొరియా గురించి మీకు తెలుసు కదా. ఆ కంట్రీ ప్రెసిడెంట్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. నార్త్ కొరియా ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్రాంతం అని ఎయిర్ స్పేస్ నిర్ధారించింది. ఎందుకంటే ఈ దేశ మిలిటరీ అక్కడ ఎప్పుడూ ఏదో ఒక మిసైల్ ను లాంచ్
చేస్తూ ఉంటుంది. నార్త్ కొరియా జపాన్ మధ్యలో ఉన్న సముద్రంలో కూడా నిరంతరం మిసైల్స్ ను లాంచ్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతం పై నుంచి ఎటువంటి విమానాల రాకపోకలు జరగవు. అయితే జపాన్ వెళ్లే విమానాలు అన్ని ఎలా వెళ్తాయి అనేది కమి డౌట్, అవన్నీ కూడా నార్త్ కొరియాకు బైపాస్ లో వెళ్తాయి.
నెంబర్ టు మక్కా
ముస్లింలు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా కొలిచే ప్రదేశం మక్కా. ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల మంది ముస్లింలు హజ్ యాత్ర చేసేందుకు అక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మక్కా ఉన్న ప్రదేశం కరెక్ట్ గా మన భూమికి సెంటర్ ఆఫ్ గ్రావిటీగా ఉంటుంది. అందువల్ల అటుగా
విమానాలు కానీ పక్షులు కానీ వెళ్ళవు. మరొక రీసన్ ఏంటంటే సెక్యూరిటీ ప్రపంచ దేశాల నుంచి వచ్చే ముస్లింలను కాపాడడమే సౌదీ అరేబియా తన ప్రథమ బాధ్యతగా పెట్టుకుంది. అందుకే వారికి సెక్యూరిటీ ఇచ్చేందుకు అటు నుంచి ఎటువంటి విమానాలను వెళ్లకుండా నో ఫ్లయింగ్ జోన్ గా మార్చింది. అలాగే ఈ మక్కా మసీదు ఉండే ప్రాంతం చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు ఉంటాయి. దీనివల్ల కూడా అది నో ఫ్లయింగ్ జోన్ అయింది.
నెంబర్ వన్ ఏరియా 51
ఇది అమెరికాలోని నెవిడా ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం దాదాపుగా 7500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన టాప్ సీక్రెట్ ప్లేస్. ఇందులో సీక్రెట్ వెపన్స్, మిసైల్స్ ఇంకా మిలిటరీ కి సంబంధించినవన్నీ ఉంటాయి. చుట్టూ కొండలు మధ్యలో చాలా విశాలంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఇందులో వెళ్ళాలంటే నార్మల్ పీపుల్ కి సాధ్యం కాదు. ఇక సైన్యానికి సంబంధించిన వాళ్ళు వెళ్లాలన్న కూడా చాలా కష్టం. ఎన్నో పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. జనరల్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఏం కనపడదు. సాటిలైట్ ద్వారా కూడా అది సరిగ్గా కనిపించదు. అంత సీక్రెట్ గా ఈ ప్రాంతాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలోకి రావడానికి కాదు ఈ ప్రాంతం పై నుంచి విమానాలు కూడా తిరగడానికి వీల్ లేదు. ఎందుకంటే అమెరికా దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా నిర్ధారించింది.