Countries Where Sun Never Rises

Countries Where Sun Never Rises

సూర్యుడు ఉదయించని దేశాలు | Countries Where Sun Never Rises

పగలు రాత్రి ప్రకృతి నియమాలని మనందరికీ తెలుసు. పగలు అయిన వెంటనే రాత్రి అవుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే రాత్రి చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తాడని, సూర్యుని కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు ఉదయించడని మీకు తెలుసా. అలాగే చంద్రున్ని చూడని దేశాలు కూడా ఉన్నాయి. 

నమశక్యంగా లేకపోయినా కొన్ని నెలల పాటు కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు. కొన్ని నెలల పాటు చంద్రుడు మాత్రమే ఉంటాడు. 24 గంటల్లో 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అని మనం అనుకున్నాం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం

కొన్ని నెలల పాటు సూర్యుడు కనిపించడు. రాత్రి మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించడు. పగలు మాత్రమే ఉంటుంది. అయితే అలాంటి ప్రదేశంలో ఎవరు జీవించరు అని మీరు అనుకుంటున్నారేమో అది కూడా తప్పే. అక్కడ జనాభా కూడా బాగానే ఉంటుంది. ప్రజలు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రసిద్ధి పొందిన దేశాల్లో అవి కూడా భాగమయ్యాయి. 

మన లిస్ట్ లో మొదటిగా వచ్చే దేశం ఫిన్లాండ్. యూరోప్ లోని ఒక దేశం. ఇది 5.5 మిలియన్ల జనాభా, 338 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న దేశం. ఒక చిన్న ద్వీపమైన ఈ దేశం చూడ్డానికి చాలా పచ్చగా ఉంటుంది. సంవత్సరంలో వేసవి కాలంలో కేవలం 73 రోజులు మాత్రమే. మనకు ఇక్కడ సూర్యుడు కనిపిస్తాడు. శీతాకాలంలో దీనికి భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ దశ కొనసాగుతుంది. అందుకే ఇక్కడ ప్రజలు వేసవి కాలంలో తక్కువగాను, శీతాకాలంలో ఎక్కువగాను నిద్రపోతారు. 

రెండవది అలాస్కా. అమెరికాలోని అతిపెద్ద నగరం అలాస్కా. అయితే ఈ ప్రాంతం అమెరికాలోని భాగం అంటే ఒప్పుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యా ఆధీనంలో ఉండేది. 1866 లో అమెరికా రష్యా నుంచి ఈ ప్రాంతాన్ని ఖరీదు చేసింది. ఇలా ఒక దేశం మరొక దేశాన్ని కొనుగోలు చేయడం కూడా ఈ దేశంతోనే మొదలైంది. అలాస్కాను మంచుగడ్డల ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మే నుంచి జూలై 15 వరకు ఇక్కడ సూర్యాస్తమయం అనేది జరగదు. కొన్ని నెలల తర్వాత శీతాకాలంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. నవంబర్ 30 రోజులు పూర్తి చీకటితో నిండిపోయి ఉంటుంది. ఈ ఈ ప్రాంతం ఆ సమయాన్ని పోలార్ నైట్స్ అంటారు. మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, నదులు మంత్రముగ్దును చేస్తాయి. ఇక్కడికి వేసవి కాలంలో కానీ లేదా శీతాకాలంలో కానీ సందర్శించడానికి చాలా మంది వెళ్తారు.అందమైన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్య పోతారు.

మూడవది స్వీడెన్. స్కాండివియా లోని దేశం ఇది. ఇక్కడ ఆరు నెలల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. వెచ్చగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి అద్భుతమైన ప్రదేశం స్వీడెన్. మే నుంచి ఆగస్టు వరకు ఉండే సమయంలో సూర్యుడు ఎప్పుడో అర్ధరాత్రి అస్తమిస్తే దేశం మొత్తం ఉదయం నాలుగు గంటల కల్లా సూర్యోదయం అయిపోతుంది. సూర్యుడు ఎక్కువ సేపు ఉండడంతో ఇది పర్యటకులకు సందర్శించడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం కన్నా అద్భుతమైన ప్రాంతం మరొకటి ఉండదు. 

నాలుగవది కెనడా. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఇక్కడ కూడా సగం కన్నా ఎక్కువ రోజులు మంచు పడుతూ ఉంటుంది. వాతావరణం చిత్ర విచిత్రమైన మార్పులు ఈ ప్రదేశంలో కూడా మనం చూడొచ్చు. కెనడాలోని ఉత్తర, పశ్చిమ భాగాల్లో వేసవి కాలంలో దాదాపుగా 51 రోజుల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. ఈ ప్రాంతంలో రోజంతా వెలుతురుగానే ఉంటుంది. ఇక కెనడాలోని నూరావర్ట్ అనే ప్రాంతంలో వాతావరణం ఇంకా చిత్రంగా ఉంటుంది. అందుకే అక్కడ జనాభా చాలా తక్కువ. ప్రపంచంలోని అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో ఇది కూడా ఒకటి. ఇక్కడ కేవలం 3000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ వేసవిలో రెండు నెలల పాటు 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అదే శీతాకాలంలో పూర్తిగా చీకటిగా ఉంటుంది. 

ఐదు ఐస్లాండ్. యూరోప్ కి ఉత్తరాన ఉన్న చిన్న ద్వీపం, తక్కువ జనసంఖ్య కలిగిన ప్రాంతం. ఇది ప్రపంచంలోని పెద్ద ఎత్తున పర్యటకులకు అత్యంత ఇష్టమైన దేశం కూడా. మే నుంచి జూలై వరకు సూర్యుడు ఇక్కడ అస్తమించడు. ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ అందాలను చూడడానికి పర్యటకులు విశేషంగా వస్తూ ఉంటారు. ఐస్లాండ్ ఎంత అందమైన ప్రదేశం అంటే, ఇక్కడ కనీసం ఒక్క దోమ కాదు కదా ఇలాంటి జీవికి సంబంధించినవి ఏవి కూడా ఉండవు. 

ఆరవది నార్వే. 385000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5.4 మిలియన్ జనాభా కలిగిన దేశం. ఇది ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ సన్, అర్ధరాత్రి దేశంగా పిలుస్తారు. దీన్ని అంటార్కిటికా సర్కిల్ లో ఉంటుంది. అందుకే పగలు రాత్రి ఇతర దేశాల కన్నా తేడాగా ఉంటాయి. మే నెల నుంచి జూలై వరకు 80 రోజుల పాటు సూర్యుడు కనిపించడు. అందుకే ఆ సమయంలో రాత్రి అనేది ఉండదు. 

ఏడవది గ్రీన్ ఉత్తర అమెరికాలో ఉన్న ప్రాంతం. ఇది నిజానికి ప్రపంచ పటంలో చూస్తే ఉత్తర అమెరికాలో భాగంగా అనిపిస్తుంది. మరోవైపు యూరోప్ లోని ప్రాంతంగా కూడా తోస్తుంది. ఇక్కడ కూడా వేసవిలు 24 గంటలు సూర్యుడు మాత్రమే ఉంటాడు. ఇక శీతాకాలంలో సూర్యుడు అస్సలు కనపడడు. పూర్తిగా చీకటితో నిండిపోయి ఉంటుంది. 

సూర్యుడు, చంద్రుడు ఆటలాడుకుంటున్నట్టుగా ఉండే ప్రాంతాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అద్భుతమైన దేశాలుగా కూడా పేరు తెచ్చుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *