Mount Kailash Mysteries

కైలాస పర్వత రహస్యాలు | Mysteries of Mount Kailash
కైలాస పర్వతాల మీద నిజంగానే శివుడు ఉంటాడా లేక అది కట్టు కథ ? ఈ విశ్వం అంతమయ్యే సంకేతాలు కైలాసగిరిలో కనిపిస్తాయి. కైలాస పర్వతాల నుంచి డమరు మరియు ఓంకార నాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి ? కైలాస పర్వతాల మీద మరో ప్రపంచం ఏదైనా ఉందా ? అన్ని నదులకు కైలాసం మాత్రమే ఎందుకు పుట్టినిల్లు ? కైలాసగిరి మీద హెలికాప్టర్ నిలపాలని చైనా ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది ? అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా చాలా మంది అధిరోహించారు, కానీ ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని ఎవరు కూడా అధిరోహించలేదు. కైలాస పర్వతం విశ్వాసానికి కేంద్రమా ? అన్ని దిశలు అక్కడికి వచ్చి కలుస్తాయా ? కైలాసగిరి మీద మరో ప్రపంచం ఉందా ? శివుడు అక్కడ యోగ ముద్రలో ఉన్నాడా ? కలియుగం అంతమవుతుందనే సంకేతాలు అక్కడే ఉంటాయా ?ఈ ఆసక్తికరమైన ఈ సంఘటనల గురించి వివరంగా తెలుసుకుందాం.
కైలాసగిరి పర్వతాల విశిష్టత గురించి శివ పురాణం, మత్య పురాణం, స్కంద పురాణాల్లో కనిపిస్తుంది. హిందూ ధర్మం ప్రకారం కేవలం పవిత్ర ఆత్మలు మాత్రమే ఇక్కడ చేరుకుంటాయని విశ్వసిస్తారు. కైలాసగిరి మీద దిక్సూచి పని చేయదు. అందుకే దీన్ని భూమి కేంద్రం అని అంటారు. కైలాసగిరి మీదనే కల్ప వృక్షం కూడా ఉందని చాలా మంది నమ్ముతారు. కల్ప వృక్షం కింద కూర్చుని ఏ కోరిక కోరిన అది నెరవేరుతుందని నమ్ముతారు. ఇందులో దేవతల శక్తులు దాగి ఉంటాయని కూడా చాలా మంది విశ్వాసం.
దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించినప్పుడు 14 రత్నాలు బయటకు వచ్చాయని, అందులో ఒకటి కల్ప వృక్షం అని కథనాలు ఉన్నాయి. దీన్ని దేవరాజు ఇంద్రుడికి ఇవ్వగా, ఇంద్రుడు ఈ దేవ వృక్షాన్ని హిమాలయాల్లో ప్రతిష్టించాడు. ఇప్పటికీ అక్కడక్కడ ఆ కల్ప వృక్షాలు హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. కైలాస పర్వతాల మీద రెండు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి మానస సరోవరం, రెండు రాక్షస సరోవరం.
మానస సరోవరంలో సూర్యుడి ఆకారంలో, రాక్షస సరోవరం చంద్రుడి ఆకారంలో కనిపిస్తుంది. కైలాసగిరిని హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు. మానస సరోవరాన్ని దేవతల సరోవరం అని కూడా పిలుస్తూ ఉంటారు. అనేక దివ్య శక్తులు ఈ సరోవరంలో స్నానం ఆడేందుకు వస్తూ ఉంటాయని నమ్ముతారు. కైలాసగిరి పర్వతాల రహస్యాలను ఎంతగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంత జటిలంగా వీటి రహస్యాలు మారుతూ ఉంటాయి. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య హిమాలయ పర్వతాలు ఉన్నాయి, వీటి మధ్యే కైలాసగిరి నెలకొని ఉంది. కైలాసగిరిని భూమికి కేంద్రంగా భావిస్తారు. దివ్య శక్తులు ప్రవాహం కలిగిన ప్రదేశంగా కొనియాడతారు. ఇక్కడ అన్ని దిక్కులు కలుస్తాయి అందుకే ఇక్కడ ఎలాంటి దిక్సూచి పని చేయదు.
కేవలం కైలాస పర్వతం హిందువులకు, జైనులకు, బౌద్ధులకు, సిక్కులకు కూడా పవిత్ర ప్రదేశం. గంగా నది నుంచి మొదలుకొని అనేక నదులు ఇక్కడి నుంచి జన్మించాయి, ప్రవహిస్తూ ఉంటాయి. గంగా నది విష్ణువు పాదాల నుంచి వచ్చి శివుని తల మీద నిలిచిందని చెప్తూ ఉంటారు. శివుడితో పాటు పార్వతీ దేవి కూడా భక్తితో కొలుస్తారు. బౌద్ధులకు కూడా ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశం.సిక్కు మతం వారు గురునానక్ ఈ కైలాస పర్వతాల మీద కొంతకాలం గడిపారని నమ్ముతారు.
కైలాసగిరి వాతావరణం గురించి రష్యా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అక్కడ ఉన్న మత గురువులను కలిశారు. ఆ తర్వాత వారికి కైలాసగిరికి నాలుగు వైపులా అలౌకిక శక్తులు ఉన్నాయని అర్థమైంది. ఈ రోజుకి అక్కడ అనేకమంది సాధువులు టెలిపతి తో అతీత శక్తులతో కనెక్ట్ అవుతూ ఉంటారని తెలుసుకున్నారు.ఈ రోజుకి ఇక్కడ అనేకమంది యోగులు, యోగ ముద్రలో ఉన్నారని నమ్ముతారు. ఇక్కడ మంచు పేరుకుపోయినప్పుడు, ఓం ఆకారంలో ఆ మంచు పేరుకొని ఉంటుంది
రామాయణంలో రావణాసురుడు గురించి తెలియంది ఎవరికీ. అతను నేల మీద నుంచి స్వర్గానికి మెట్లు నిర్మించాలని చూశాడు. అప్పుడు ఆ నిర్మాణం కైలాస పర్వతాల నుంచి మొదలు పెట్టాలనుకుంటాడు. ఈ రోజుకి అక్కడ మెట్ల నిర్మాణం మనకు కనిపిస్తుంది. కానీ అతని ప్రయత్నం సఫలం కాలేదు. ఎవరికైతే ప్రత్యేక శక్తులు ఉంటాయో వారు మాత్రమే కైలాసగిరిని ఎక్కగలుగుతారని నమ్ముతారు. ఇది కేవలం కల్పన మాత్రమే అని మాట్లాడేవారు ఒకసారి అక్కడికి వెళ్లి తీరాల్సిందే. పర్వతారోహణ చేయకపోయినా పర్లేదు అక్కడికి వెళ్ళగానే ఆ పరిసర ప్రాంతాల్లో వారికి అతీత శక్తుల అనుభవం కలుగుతుంది. అలౌకిక ఆనందం వస్తుంది.
ఇప్పటివరకు ఈ పర్వతం అంచుల వరకు ఎవరు వెళ్ళలేకపోయారు, ఇప్పటివరకు ఈ పర్వతాల మీద ఎవరు ఎందుకు చేరుకోలేకపోయారు అనేది ఇప్పటికి ఒక మిస్టరీనే. ఇప్పటివరకు ఎందుకు ఎవరు ఇక్కడికి చేరుకోలేదు ? విభిన్న మతాల వారికి భిన్నమైన విశ్వాసాలు ఈ కైలాస పర్వతాల గురించి ఉన్నాయి.
హిందూ మతం ప్రకారం ఈ పర్వతాలు శివుడు పార్వతుల నివాస స్థలం.ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కైలాసగిరి ఉంది. హిందూ మతంతో పాటు ఇతర మతస్తులు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో నిండి ఉంటాయి. ఇతర పర్వతాల మీద సమయానుకూలంగా మంచు కరిగిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ మంచు అలాగే ఉంటుంది.
కైలాస పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమై, గాంగ్సే పర్వతాల్లో ఒక శిఖరం. ఇది ప్రపంచపు పునాది స్తంభం అని, తామరపువ్వు రెక్కల లాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసి కేంద్ర స్థానంలో ఉంది.
రావణుడు శివ భక్తుడు రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించిన వైనం రామాయణంలో చెప్పబడలేదు. రావణుడి తల్లి వ్యాధిగ్రస్తురాలు అవుతుంది. అవసాన దశలో ఉన్న తల్లికి కైలాస దర్శనం కలిగించేందుకు గుడిని తన వీపు మీద పెట్టుకొని తల్లి దగ్గరికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతను పెట్టిన భక్తి పరీక్షలో నెగ్గినందుకు అతడికి పర్వతాన్ని ప్రసాదిస్తాడు. శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి రావణాసురుడు ఇక్కడికే వచ్చేవాడని, ఇక్కడే నివసించేవాడని, అందుకే ఒక నదిని ఇక్కడ సృష్టించాడని, ఆ నదికి అందుకే రాక్షస సరోవరం అనే పేరు వచ్చిందని చెప్తారు.
తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్ర సంవర బుద్ధుని ఆవాసంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని పాటిస్తూ, వేల మంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు. అనేక మతాలకు చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో మట్టి రావడం చుట్టి రావడం పుణ్యఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం 42 కిలోమీటర్ల పొడవు.
కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక రోజులోనే పూర్తి చేయాలని నమ్ముతారు. అదంత సులభం మాత్రం కాదు.కొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణ అంతా సాగిలపడి వేళ్ళతో, మోకాళ్ళ మీద కూర్చుని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి, గుర్తుపెట్టిన స్థలం వరకు పాకి మళ్ళీ మళ్ళీ ఆ పద్ధతిని పునరావృత్తం చేస్తూ ఉంటారు. ఈరోజు శివుడు తన కుటుంబంతో ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీన్ని దివ్య లోకం అని అంటారు. కైలాస పర్వతం అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు.
అక్కడ ఒక విమాన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లి వింటే అది ఓంకార నాదంగా వినిపిస్తుంది. అలా అనేక శక్తులు ఈ కైలాస పర్వతం మీద ఉన్నాయి. 1926 లో హ్యూగ్ రెట్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి 6000 అడుగుల ఎత్తున శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టమైందని తీర్మానించాడు. ఈశాన్య అంచు నుంచి ఎక్కేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. కానీ సమయం చాలలేదు. హెర్బర్ టిచి 1936 లో గుర్లా మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ, ఈ పర్వతంలో ఉన్నాడు. ఆయన కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని అనుమానం వచ్చి ఆ గార్పోన్ ని అడిగాడు.
ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే పూర్తిగా పాపరహితమైన వ్యక్తులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకులను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షి లాగా మారి శిఖరాగ్రానికి ఎగరగలుగుతారు అని సమాధానం ఇచ్చాడు. 1980 లో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన రైన్ హోల్డ్ మెన్నర్ కు ఈ పర్వతాన్ని అధిరోహించే అవకాశం ఇచ్చింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించాడు. కైలాస పర్వతం మీద హిమంతో నిండిన మనుషులు ఉంటారని కూడా నమ్ముతారు. అక్కడ కాలం కూడా చాలా వేగంగా సాగుతుందని కూడా నమ్ముతారు.
ఒక వ్యక్తి చేసిన ప్రయత్నంతో అతను చెప్పిన అనుభవాలు బట్టి ఈ ప్రపంచానికి ఆ విషయాలు తెలిసాయి. తిరిగి బయటకు వచ్చాక సాధారణ స్థితిలోకి వచ్చాడు. 2001లో చైనా, స్పానిష్ పర్వతారోహక బృందం దానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతి ఇచ్చారు.కానీ అంతర్జాతీయ అభ్యంతరాలకు తలగక తప్పలేదు. అప్పటినుంచి పర్వతారోహణ ప్రయత్నాలను నిషేధించారు. నాసా పరిశోధకులు కూడా ఈ పర్వతం అద్భుతమైన ప్రాంతం అని అభిప్రాయపడ్డారు. కై
లాసగిరి ఎత్తు కారణంగానే కాదు, అక్కడి ప్రత్యేకతల కారణంగా ఎక్కువ ప్రాచుర్యం సంపాదించింది. అక్కడ మంచు కరుగుతున్నప్పుడు డమరకం లాంటి శబ్దాలు వినిపిస్తాయని అంటారు.